వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైంది: సత్యేంద్రజైన్

Update: 2020-07-20 19:16 GMT

కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి మొదలైందని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ వ్యాప్తి స్థానికంగా పరిమితమైందా? సామాజికమా అనే విషయం సాంకేతిక అంశం అని అన్నారు. ఈ విషయాన్ని నిర్ణయించాల్సింది కేంద్రమేనని అన్నారు. కాగా.. జైన్ కరోనా సోకి ఇటీవలే కోలుకున్నారు. ఈ రోజు నుంచి మళ్లీ విధుల్లోకి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సత్యేంద్ర జైన్ వైద్య అధికారులతో సామావేశాలు నిర్వహించి ఆస్పత్రులను సందర్శించేవాడని.. కరోనాపై పోరాటంలో ఈవిధంగా భాగం అవుతూ..

చివరికి కరోనా సోకి ఆస్పత్రిలో చేరాడని ట్వీట్ చేశారు. నెల రోజుల చికిత్స తరువాత కోలుకొని.. ఈరోజే విధుల్లోకి వచ్చారని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

Similar News