భారీ వర్షాలకు 470 మృతి

Update: 2020-07-22 09:32 GMT

ఓవైపు కరోనా, మరో వైపు భారీ వర్షాలతో పలు రాష్ట్రలు అతలాకుతలం అవతుంది. మొత్తం 8 రాష్ట్రాల్లో భారీ వర్షాలతో మొత్తం 470మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమబెంగాల్, అసోం, గుజరాత్ రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు భారీ ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. బెంగాల్ లో వరదలకు 142 మంది మరణించినట్టు హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలియజేసింది. అటు, మరో ఐదుగురు గల్లంతయ్యారు. వరదల కారణంగా అసోంలో 111, గుజరాత్ లో 81 మంది, మహారాష్ట్రలో 46, మద్యప్రదేశ్ లో 44 మంది మృతిచెందారు. అటు కేరళలో 23మంది వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఇటీలవ కాలంలో భారత్ లో ఏర్పడిన వరదల కారణంగా 470మంది మరణించారు.

Similar News