నేటినుంచి ప్రారంభం కావాల్సిన అమర్‌నాథ్ యాత్ర రద్దైంది. కరోనా విస్తృతంగా ఉన్న తరుణంలో యాత్రను రద్దు చేస్తూ దేవస్థాన బోర్డ్ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ప్రారంభమై ఆగస్ట్ 3 వరకు కొనసాగాలని నిర్ణయం తీసుకున్నా ఆఖరు నిమిషంలో రద్దు చేశారు. ఈనెల 18న రక్షణ మంత్రి రాజ్‌నాథ్.. అమర్‌నాథ్ ఆలయానికి వెళ్లి మంచు శివలింగం వద్ద పూజలు నిర్వహించారు. దీంతో యాత్ర జరుగుతుందని భక్తులు భావించినా చివరి నిమిషంలో రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారు.