కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు కేరళ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తుంది. అయినా.. మహమ్మారి ఏమాత్రం తగ్గటం లేదు. అన్ని వర్గాల వారికి వైరస్ సోకుతుంది. కేరళలో కరోనా వ్యాప్తి మొదట్లో తక్కువగా ఉన్నప్పటికీ.. ఇటీవల కాలంలో మాత్రం వేగం విస్తరిస్తుంది. తాజాగా సమీపంలోని చునంగంవేలిలోని ఒక కాన్వెంట్‌లో 18 మంది కాథలిక్ సన్యాసినులకు కరోనా సోకింది. ఈ విషయాన్ని వైద్య అధికారులు తెలిపారు. కుజిప్పల్లిలోని 71 ఏళ్ల కాథలిక్ సన్యాసినితో వారు కలిసారని వైద్యులు తెలిపారు. కరోనా సోకి జూలై 11న 71 ఏళ్ల కాథలిక్ సన్యాసిని మరణించారు.