తమిళనాడులో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో తమిళనాడులో కొత్తగా 4,965 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,80,643కు చేరింది. అందులో 1,26,670 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 51,344 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఒక్కరోజే 75 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,626కు చేరింది.