భారత్‌లో 12లక్షలకు చేరువలో కరోనా కేసులు

Update: 2020-07-22 13:59 GMT

భారత్‌లో కరోనా విజృంభిణ కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 37,724 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 11,92,915కు చేరిందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అయితే, ఇప్పటివరకూ 7,53,050 మంది కరోనా నుంచి కోలుకోగా.. 4,11,133 చికిత్స పొందుతున్నారు. కరోనా మహమ్మారి ఒక్కరోజులోనే 648 మందిని బలికొంది. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 28,732కి చేరింది. కాగా మహరాష్ట్రలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అక్కడ మూడులక్షల మార్కును దాటాయి.

Similar News