దేశవ్యాప్తంగా ‘కేఫ్ కాఫీ డే’ ఔట్ లెట్లు మూతపడుతున్నారు. తాజాగా దాదాపు 280 ఔట్‌లెట్‌లు మూతపడ్డాయి. గత ఏడాది కేఫ్ కాఫీ డే ఆర్దిక సంక్షోభంలో చిక్కుకోవడంతో.. దాని యజమాని సిద్ధార్ధ్ జైన్ చిత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల కేఫ్ కాఫీ డే మరింత సంక్షోభంలోకి కూరుకుపోయింది. కేఫ్ కాఫీ డే(సీసీడీ) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో పలు ఔట్‌లెట్ల ను మూసివేసింది. గత ఏడాది(2019) ఏప్రిల్-నవంబర్ మధ్య దాదాపు 500 ఔట్‌లెట్లను క్లోజ్ చేసింది. తాజా మూసివేతలతో ఈ ఏడాది జూన్ 30 నాటికి... కేఫ్ కాఫీ డే
ఔట్ లెట్స్ సంఖ్య 1,480 కి తగ్గాయి. మూతపడతున్న ప్రతీసారీ ఆర్ధిక ఇబ్బందులనే కారణంగా చూపిస్తుంది యాజమాన్యం.