పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. పది గ్రాముల ధర..

Update: 2020-07-22 17:38 GMT

కరోనా సీజన్ లో కూడా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లోనూ, దేశీ మార్కెట్లోనూ పసిడి ధర ఆల్ టైమ్ హైకి చేరుకుంది. పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.500 పెరిగి రూ.50,026కు ఎగిసింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కేజీ వెండి ధర ఒక్క రోజులో రూ.3502 పెరిగి 60,844కు చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి విస్తృతమవుతున్న తరుణంలో అమెరికన్ డాలర్ బలహీనపడి యెల్లోమెటల్ కు గిరాకీ పెరిగింది. మార్కెట్లో అనిశ్చిత పరిస్థితి నెలకొన్నందున బంగారం మీద పెట్టుబడి సురక్షితంగా ఉంటుందని మదుపరులు భావిస్తున్నారు. దీంతో బంగారం, వెండి వంటి విలువైన లోహాలపై పెట్టుబడులు అధికమవడంతో డిమాండ్ పెరిగింది.

Similar News