జమ్మూ కాశ్మీర్‌లో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. రాజౌరి జిల్లాలోని ఎల్‌ఓసీ వెంబడి ఫార్వర్డ్ ప్రాంతాలపై పాక్ సైన్యం భారీగా కాల్పులు జరిపింది. మోర్టార్ షెల్స్‌ను ప్రయోగించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అధికారులు తెలిపారు. జూలై 18న పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి ఫార్వర్డ్ పోస్టులు, గ్రామాల వైపు మోర్టార్లు ప్రయోగించింది. ఈ ఘటనలో ఇల్లు కూలి, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. అలాగే 10న రాజౌరి జిల్లాలో నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ దళాల కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఓ ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మంగళవారం పాక్ సైన్యం రాజౌరి జిల్లాలోని సుందర్బని సెక్టార్లో నియంత్రణ రేఖ వెంట పలు ఆయుధాలతో పాటు కాల్పులు జరుపడంతో పాటు మోర్టార్ షెల్స్‌ను ప్రయోగించింది.