నేపాల్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి నేపాల్ సర్కార్ లాక్‌డౌన్ విధించింది. అయితే త్వరలో లాక్‌డౌన్ ముగియనున్నది. కరోనా నేపథ్యంలో మార్చి 24న విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ ఆగస్టు 17తో ముగుస్తుందని ప్రభుత్వ అధికార ప్రతినిధి డాక్టర్ యుబా రాజ్ ఖతివాడ తెలిపారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 17 నుంచి స్కూళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు తెరుచుకుంటాయని చెప్పారు. అయితే భారీ వేడుకలు, పార్టీలను అనుమతించబోమన్నారు. కాగా, నేపాల్‌లో కరోనా కేసుల సంఖ్య 18 వేలు దాటింది. కరోనా బారిన పడి ఇప్పటి వరకు 40 మంది ప్రాణాలు కోల్పోయారు.