కొవిడ్‌తో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా సాయం..

Update: 2020-07-21 21:24 GMT

కొవిడ్ బారిన పడి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు నిర్ణీత మొత్తంలో పరిహారం అందిస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. సంస్థలో చాలా మంది ఉద్యోగులు కరోనా బారిన పడి మరణించారని జూలై 20 నాటి సర్క్యులర్ లో ఎయిర్ ఇండియా పేర్కొంది. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన శాశ్వత ఉద్యోగుల కుటుంబాలు, చట్టపరమైన వారసుడికి 10 లక్షల రూపాయలు, ఫిక్స్ డ్ టెర్మ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 5 లక్షలు, ఏడాది పాటు నిరంతరం పనిచేసిన ఉద్యోగులకు రూ.90 వేలు అందజేస్తామని సంస్థ వివరించింది. ఒకవేళ ఉద్యోగి కాంట్రాక్టర్ ద్వారా కానీ, సర్వీస్ ప్రొవైడర్ ద్వారా కానీ నియమితులై ఉంటే రెండు నెలల స్థూల వేతనాన్ని ఇస్తామని తెలిపింది. ఈ చెల్లింపులు ఏప్రిల్ 1 2020 నుంచి మార్చి 2021 వరకు అమలులో ఉంటుందని పేర్కొంది.

Similar News