కేరళలో కరోనా కలకలం.. రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్!

Update: 2020-07-23 14:51 GMT

కేరళలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ర్టవ్యాప్తంగా బుధ‌వారం ఒక్క రోజే సుమారు వెయ్యికి పైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. బుధ‌వారం కేర‌ళ‌లో మొత్తం 1038 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో వైర‌స్ బారిన పడినవారి సంఖ్య 15,032కు చేరింది. కరోనా బారిన పడి మ‌ర‌ణించిన వారి సంఖ్య 45కు చేరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మ‌ళ్లీ పూర్తి స్థాయి లాక్‌డౌన్ అమ‌లు చేయాల‌ని కేర‌ళ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ర్టంలో వైర‌స్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేప‌థ్యంలో సీఎం విజ‌య‌న్ గ‌త శుక్ర‌వార‌మే వ‌ర్చువ‌ల్ ఆల్ పార్టీ మీటింగ్ నిర్వ‌హించారు. అయితే పూర్తి స్థాయి లాక్‌డౌన్ మ‌రోసారి అమ‌లు చేయాల‌ని నిపుణులు చెబుతున్న‌ట్లు ఆ స‌మావేశంలో సీఎం విజ‌య‌న్ వెల్ల‌డించారు.

Similar News