మధ్యప్రదేశ్ మంత్రికి కరోనా పాజిటివ్

Update: 2020-07-23 13:40 GMT

కరోనా మహమ్మారి అన్ని రంగాల్లో విస్తరిస్తుంది. ఇటీవల అన్ని రాష్ట్రాలో కరోనా.. ప్రజాప్రతినిధులపై విరుచుకుపడుతుంది. తాజాగా మధ్యప్రదేశ్ మంత్రికి కరోనా సోకిందని వైద్యులు నిర్థారించారు. దీంతో ఆయన్న గురువారం ఉదయ అతన్ని భోపాల్ నగరంలోని చిరయూ వైద్యకళాశాల ఆసుపత్రికి తరలించారు. ఇటీవల మరణించిన గవర్నర్ లాల్జీటాండన్ అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రికి కరోనా సోకింది. అయితే, కరోనా సోకిన మంత్రి మంగళవారం ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. దీంతో.. గవర్నర్ అంత్యక్రియలు, కేబినేట్ మీటింగ్ లో పాల్గొన్న వారంతా ఆందోళన చెందుతున్నారు.

Similar News