భారత్‌లో కరోనా తీవ్రరూపం దాల్చుతుంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ఆందోళన వ్యక్తమవుతుంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఈరోజు నమోదైన 45,720 కేసులతో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 12,38,635కు చేరింది. మొత్తం కేసుల్లో 7,82,606 ఈ మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. ఇంకా 4,26,167 మంది చికిత్స పొందుతున్నారు. ఒక్కరోజే.. 1129మంది కరోనాతో మరణించగా.. ఇప్పటివరకూ 29,557 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో కరోనా పరీక్షలు కూడా పెద్ద ఎత్తున జరగుతున్నాయి. ఒక్కరోజే 3,50,823 కరోనా పరీక్షలు జరిగాయని ఐసీఎంఆర్ వెల్లడించింది.