సీఎం జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ

Update: 2020-07-23 14:10 GMT

సీపీఐ రాష్టకార్యదర్శి రామకృష్ణ.. ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసిత ప్రతి కుటుంబానికి పదిలక్షల పరిహారం ఇవ్వాలని అన్నారు. నిర్వాసిత కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన ప్రతీఒక్కరి ఆర్&ఆర్ ప్యాకేజీ ఇవ్వాలన్నారు. అయితే, కటాఫ్ డేట్ అంటూ ఏమీ ఉండకూడదని అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ అందాల్సిందేని అన్నారు. నిర్వాసిత కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో పూర్తిగా మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. తరువాత పరిహారం కూడా పూర్తిగా చెల్లించిన తరువాతే వారిని తరలించాలని సీఎంకు రాసిన లేఖలో రామకృష్ణ డిమాండ్ చేశారు.

Similar News