టాప్‌ పొజిషన్‌పై కన్నేసిన బజాజ్‌ ఆటో.. ఎగుమతుల పెంపునకు కసరత్తు

Update: 2020-07-24 11:33 GMT

బజాజ్ ఆటో అమ్మకాలు క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్ 19 పేండమిక్ నుంచి ఇప్పడిప్పుడే బయటపడుతోంది. దేశీయంగా అమ్మకాలు కంటే ఎగుమతులపై ప్రధానంగా దృష్టి పెట్టింది దేశీయ ఆటో దిగ్గజం. ప్రస్తుతం బజాజ్ టూ వీలర్ సేల్స్ లో 45శాతం ఎగుమతులే ఉన్నాయి. కరోనా కాలంలో దేశీయంగా జనవరి నుంచి జూన్ వరకు 5లక్షల 89వేలు మాత్రమే ద్విచక్రవాహనాలు అమ్మిన కంపెనీ 6లక్షల 64వేలు ఎగుమతి చేసింది.

ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో బజాజ్ మార్కెట్ మెరుగ్గా ఉంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్ కంపెనీ కొత్త యూనిట్ నెలకొల్పడానికి రంగం సిద్దం చేసింది. 18 నెలల్లో దీనిని అందుబాటులోకి తీసుకరావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అటు థాయిలాండ్, యూరోప్ లో కూడా కంపెనీ కార్యకలాపాలు పెంచాలని నిర్ణయించింది. డిజైన్ ఆఫీసులు ప్రారంభించి అమ్మకాలు పెంచుకోవడంపై కసరత్తు చేస్తుంది.

దేశీయంగా అమ్మకాల్లో పోటీ కంపెనీలను తట్టుకుని మోటార్ సైకిల్ విభాగంలో గట్టి పోటీ ఇస్తుంది. అదే సమయంలో థర్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ పై ఫోకస్ పెట్టి మార్కెట్ విస్తరిస్తోంది. కంపెనీ కోవిడ్ పేండమిక్ నుంచి బయటపడుతోంది. దీంతో షేర్ మార్కెట్లో కూడా మెరుగ్గా ఉంది. ప్రస్తుతం కంపెనీ షేర్ 3030 వద్ద ట్రేడ్ అవుతోంది. మదుపర్లు బజాజ్ ఆటో లాభాలు పండిస్తోంది.

Similar News