బొలీవియాలో మరోసారి సాధారణ ఎన్నికలు వాయిదా

Update: 2020-07-24 14:37 GMT

బొలీవియాలో సాధారణ ఎన్నికలను మరోసారి వాయిదా పడ్డాయి. సెప్టెంబర్‌లో జరగాల్సిన సాధారణ ఎన్నికలను రెండో సారి వాయిదా వేశారు. ఆగస్టు చివరి వారం, సెప్టెంబర్‌ మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించాలని తేదీని ప్రకటించారు. అయితే ఆ సమయంలో కరోనా విజృంభిస్తోందన్న భయంతో మరోసారి వాయిదా వేశారు. అక్టోబర్ 18న ఎన్నికలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడడం ఇది రెండోసారి. మొదట మే నెలలో ఎన్నికలు నిర్వహించాలని చూసినా లాక్‌డౌన్‌ కారణంగా సెప్టెంబర్‌కు వాయిదా పడ్డాయి. కరోనా ఉధృతి కారణంగా ఇప్పుడు అక్టోబర్‌కు వాయిదా వేశారు.

Similar News