కరోనా మహమ్మారి ఎక్కువగా 60ఏళ్లు దాటిన వృద్దులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వృద్దులు ఇల్లు దాటి రావద్దని.. మరో నెలరోజులైనా ఈ జాగ్రత్తలు పాటించాలని అన్నారు. వృద్దులతో పాటు.. షుగర్, గుండె జబ్బులు, హెచ్ఐవీ, క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అరవై ఏళ్లు దాటిన వారిని ఇంట్లో ప్రత్యేక గదుల్లో ఉంచి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఏపీ సుమారు యాభైలక్షల మంది అరవై ఏళ్లు దాటిన వారున్నారని.. వీరంతా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పలు అనారోగ్యాలతో ఇబ్బందిపడుతున్న వారు సమాయానికి మందులు వాడాలని అన్నారు. చాలా మంది కరోనా లక్షణాలు లేకుండా హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను వాడుతున్నారని, వాటిని వాడవద్దని కూడా సూచించారు.