మహారాష్ట్రలో కరోనా కలకలం సృష్టిస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,865 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా బారిన పడి 298 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 12,854కి చేరింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,47,502 మంది కరోనా బారిన పడ్డారు. 1,36,980 మంది ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. కరోనా మహమ్మారి నుండి కోలుకుని 1,94,253 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇక ముంభై మహానగరంలో 1,257 కరోనా నిర్ధారణ అయ్యాయి. కరోనా బారిన పడి 55 మంది మృతి చెందారు. ముంభైలో ఇప్పటి వరకు 1,05,829 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 5927 మంది మృత్యువాత పడ్డారు.