బీహార్ లో కరోనా వ్యాప్తి రోజుకోవిధంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 4 లక్షల 9 వేల 88 నమూనాలను పరీక్షించగా.. 30066 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. దీని ప్రకారం, పరీక్షింపబడ్డవారిలో ప్రతి 13 మందిలో ఒకరు వ్యాధి బారిన పడుతున్నారు. గత వారం వరకు, ప్రతి 16 నమూనాలలో ఒక పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పుడు ఈ సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ప్రారంభంలో, ప్రతి 50 నమూనాలలో ఒక కేసు పాజిటివ్ గా వచ్చేది. గత ఏడు రోజులుగా.. 71 వేల 876 నమూనాలను పరీక్షించారు.. దాంతో 10 వేలకు పైగా కేసులు కనుగొనబడ్డాయి. అంటే, ప్రతి 7 నమూనాలలో ఒకరికి వ్యాధి సోకుతున్నట్టు కనిపిస్తుంది. గత వారంలో, బీహార్లో 49% మంది రోగులు పెరిగారు.