వాడేసిన మాస్కులు అలానే పడేస్తున్నారా..

Update: 2020-07-24 13:05 GMT

కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు అవలంభించినా ఎవరికి వారు తమ వంతుగా ఎంతో కొంత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మనం వాడిపడేసి మాస్కులు, గ్లౌజులు కూడా పర్యావరణాన్ని కలుషితం చేయడంతో పాటు వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశాలు ఉంటాయని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. వాణిజ్య సంస్థలు, షాపింగ్ మాల్స్, ఇతర సంస్థలు, కార్యాలయాలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.

కరోనా సోకిన వారు, సోకని వారు ఎవరైనా సరే మాస్కులు వాడిన తరువాత పడేసే ముందు వాటిని కత్తిరించి మూడు రోజులు పేపర్ బ్యాగులో ఉంచి పడేయమంటున్నారు.

వైద్య సిబ్బంది ధరించే పీపీఈ కిట్లు సైతం ఇలానే పడేయాలి.

ఇక కొవిడ్ బారిన పడిన వారు ఉపయోగించే వస్తువులను, ఆహార పదార్థాలు కానీ, టెట్రా బాటిల్స్ కానీ ఏవైనా సంచుల్లో నింపి గట్టిగా కట్టి పడేయాలి.

కొవిడ రోగులు వాడిన మాస్కులు, టిష్యూలు, ఇతర నాన్ ప్లాస్టిక్, సెమీ ప్లాస్టిక్ వంటి బయో మెడికల్ వ్యర్థాలను వేరుగా పసుపు రంగు సంచుల్లో వేయాలి. ఈ సంచులపై సోడియం హైపో క్లోరైట్ పిచికారీ చేసి చెత్తను తీసుకెళ్లే వారికి అందజేయాలి. సాధారణ ఘన పదార్థాలకు పసుపు రంగు సంచులు వాడరాదు.

ఐసోలేషన్ వార్డుల్లో వాడే వస్తువులను ఎరుపు రంగు సంచిలో వేయాలి.

వ్యర్థాలను తడి, పొడి వంటి వాటిని వేరు వేరు రంగులు ఉపయోగించాలి. ఈ డస్ట్ బిన్లకు ప్రతి రోజు క్రిమిసంహారక మందులు స్ప్రే చేస్తుండాలి.

Similar News