జమ్ముకశ్మీర్‌లో భూకంపం సంభవించింది. శుక్రవారం తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. జమ్ములోని కాత్రాలో ఉదయం 5.11 గంటలకు భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.0గా నమోదయ్యింది. కత్రాకి తూర్పున 89 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. వారం రోజుల వ్యవధిలో కత్రాలో భూకంపం రావడం ఇది రెండోసారి. జూలై 17న 3.9 తీవ్రతతో భూమి కంపించింది. జులై 8న రాజౌరీలో కూడా 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.