మహారాష్ట్రలో భూకంపం సంభవించింది. గురువారం మధ్యరాత్రి స్వల్పంగా భూమి కంపించింది. మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో ఈ భూకంపం సంభవించింది. గురువారం మధ్యరాత్రి 12.26 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.1 గా నమోదయ్యింది. పాల్ఘర్ సమీపంలో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్) ప్రకటించింది.