ఏటిఎం పిన్ నెంబర్ ఎంత అని అడిగి..

Update: 2020-07-23 19:17 GMT

పర్సు దొంగింలించారు.. అందులో ఏటిఎం, ఆధార్ కార్డ్ తప్పించి ఏమీ లేవు.. పిన్ నెంబర్ ఎలా అని మళ్లీ వెనక్కు వెళ్లి పోలీసుల చేతికి చిక్కారు చోరకళలో నైపుణ్యంలేని నోయిడా దొంగలు. బుధవారం రాత్రి ఓ వ్యక్తి రోడ్డు మీద వెళుతున్నాడు. ఇంతలో ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి వెళుతున్న వ్యక్తిని గన్ తో బెదిరించి అతడి వద్ద నుంచి పర్స్, ఫోన్ లాక్కున్నారు. కొద్ది దూరం వెళ్లాక పర్సు చూసుకుంటే అందులో నోట్లు ఏమీ లేవు.. ఆధార్ కార్డు, ఏటిఎం కార్డ్ మాత్రమే ఉన్నాయి.

పిన్ నెంబర్ లేకపోతే డబ్బెలా డ్రా చేసుకుంటాం అని భావించి మళ్లీ వెనక్కి వచ్చి సదరు వ్యక్తిని ఏటీఎం పిన్ నెంబర్ అడిగారు. అతడు చెప్పిన వెంటనే దొంగలు వెళ్లి పోయారు. ఈ లోపు పర్సు పోగొట్టుకున్న వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు అటుగా వెడుతున్న వ్యక్తుల సాయంతో. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దొంగల బైక్ ని అడ్డగించారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దుండగులు వారి మీద కాల్పులు జరిపారు. ఎట్టకేలకు నిందితులను పట్టుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, ఏటీఎం కార్డ్, రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకుని బైక్ ని సీజ్ చేశారు పోలీసులు.

Similar News