మురళి మనోహర్ జోషి వాంగ్మూలం నమోదు చేసిన సీబీఐ కోర్టు

Update: 2020-07-23 21:26 GMT

1992 బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేత మురళి మనోహర్ జోషి వాంగ్మూలాన్ని సిబిఐ ప్రత్యేక కోర్టు గురువారం నమోదు చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిబిఐ జడ్జి ఎస్కె యాదవ్ 86 ఏళ్ల జోషి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.. ఇక ఇదే కేసులో మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ (92) వాంగ్మూలాన్ని కూడా శుక్రవారం ఇదే తరహాలో నమోదు చేసే అవకాశం ఉంది. బాబ్రీ మసీదు కూల్చివేత విచారణ కేసులో ప్రస్తుతం 32 మంది నిందితుల వాంగ్మూలాలను సిఆర్‌పిసి సెక్షన్ 313 కింద రికార్డ్ చేయనుంది సిబిఐ కోర్టు.

Similar News