ఆగస్టు5 న జరగనున్న అయోధ్య రామాలయ భూమి పూజ కార్యక్రమాన్ని నిలిపివేయాలని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఢిల్లీకి చెందిన న్యాయవాది సాకేత్ గోఖలే పిటిషన్ ఈ పిటిషన్ వేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో అన్‌లాక్ 2 మార్గదర్శకాలు ఉల్లంఘించి.. రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారని ఆయన పిటిషన్ లో తెలియజేశారు. సాకేత్ గోఖలే గతంలో పలు విదేశీ వార్తా పత్రికల్లో పనిచేసిన గోఖలే సామాజిక కార్యకర్త. 200 మందితో జరిపించే ఈ కార్యక్రమం వలన కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అన్నారు. ప్రజారోగ్యం కోసమే తాము ఈ పిల్ దాఖలు చేశామని గోఖలే చెప్పారు. ఈ పిటిషన్ లో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేశారు. అయితే, ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఈకార్యక్రమానికి ఆహ్వానించిన నేపథ్యంలో ఈ భూమి పూజ కార్యక్రమంపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంగీకరించలేదు.