రాజస్థాన్ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. సచిన్ పైలట్ వర్గానికి స్పీకర్ అనర్హత నోటీసులు పంపిచడంతో మరింత ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్ అసమ్మతి వర్గానికి స్పీకర్ జోషి నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ.. పైలట్ వర్గం హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు శుక్రవారం తీర్పుచెప్పాల్సి ఉండగా.. పైలట్ వర్గంలోని ఓ ఎమ్మెల్యే ఈ విషయంలో కేంద్రాన్ని ప్రతివాధిగా చేయాలని కోరారు. దీనికి కోర్టు అంగీకరించింది. దీంతో శుక్రవారం రావలసిన తీర్పు మరింత ఆలస్యం కానుంది.
కాగా.. కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌తో పాటు 18మంది అసమ్మతి ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో సచిన్ వర్గం హైకోర్టుకెక్కింది. పైలట్ వర్గాన్ని సవాల్ చేస్తూ.. స్పీకర్ సుప్రీం తలుపుతట్టారు. ఎమ్మెల్యేల అనర్హత నిర్ణయంపై రాజస్థాన్ హైకోర్టు తీర్పు ఇవ్వొచ్చని సుప్రీం కోర్టు తెలిపింది.