పీకల్లోతు కష్టాలో స్పైస్ జెట్?

Update: 2020-07-24 12:47 GMT

దేశీయ బడ్జెట్ ఎయిర్ లైన్స్ సంస్థ స్పైస్ జెట్ పీకల్లోతు కష్టాలో ఉందా? కోవిడ్ కారణంగా ఆదాయం తగ్గిపోయి ఇబ్బందులు పడుతున్న కంపెనీకి లీగల్ కష్టాలు కూడా తోడయ్యాయి. ఇండియాలో ఇప్పటికే ఎయిర్ లైన్స్ కంపెనీలు నష్టాలు బాట పడుతున్నాయి. ఇండిగో సంస్థ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. మరికొన్ని కంపెనీలు కాస్ట్ కటింగ్ పై ద్రుష్టిపెట్టాయి. గతంలో చాలా కంపెనీలు నష్టాల బాట పట్టినా.. లాభాల్లో నడిచిన స్పైస్ జెట్ ను మాత్రం ఈసారి సంక్షోభం వదల్లేదు. రెక్కల చుట్టూ కారుమబ్బులు కమ్ముకుంటున్నాయి. 2019 ఆర్ధిక సంవత్సరం బ్యాలెన్స్ షీట్ ప్రకారం కంపెనీ లిక్విడిటీ 77.9 కోట్లు మాత్రమే. గత కొంతకాలంగా ఆదాయం లేదు.. నిర్వహణ భారంతో అవి కూడా కరిగిపోయినట్టు తెలుస్తోంది. కంపెనీకి ప్రధాన ఆదాయవనరుగా ఉన్న కార్గో పూర్తిగా పడిపోయింది. సాధారణంగా స్పైస్ జెట్ సంస్థ సేల్స్ నెలకు Rs.1000-1200 కోట్లు ఉండేది.. క్రైసిస్ కారణంగా ఇది రూ.100-140 కోట్లకు పడిపోయింది. దీంతో పాటు... 25 విమానాల కొనుగోలు కోసం బాంబార్డియన్ సంస్థతో ఒప్పందం చేసుకుంది స్సైస్ జెట్. ఇప్పటికే 5 విమానాలు వచ్చాయి. అయితే మిగిలిన విమానాలు వద్దంటూ స్పైస్ జెట్ ఆర్డర్ క్యాన్సిల్ చేసింది. దీనిపై బాంబోర్డియన్ సంస్ధ యూకేలో 43 మిలియన్ డాలర్లకు సూట్ వేసింది. చివరి నిమిషంలో క్వాలిటీ పేరుతో ఒప్పందాన్ని రద్దు చేయడాన్ని ప్రశ్నించింది అక్కడి కంపెనీ. దీనిపై న్యాయపోరాటం చేస్తోంది స్పైస్ జెట్. ఏజెన్సీలు రేటింగ్ తగ్గించడంతోరుణాలు వచ్చే పరిస్థితి లేదు. అటు ఇప్పటికే ప్రమోటర్స్ కు చెందిన 52శాతం వాటాతో సమానంతో రుణాలున్నాయి. కొత్తగా రెండేళ్ల వరకూ నిధుల సమీకరణ అసాధ్యమనినిపుణులు అంటున్నారు. ఇలా సమస్యలు చుట్టుముట్టడంతో లాభాల్లో ఉన్న కంపెనీ కాస్త.. కష్టాల వైపు వెళుతోంది. మరి ఎయిర్ లైన్స్ నడపడంలో తనకంటూ స్టైల్.. సక్సెస్ మెన్ బిరుదు ఉన్న సంజయ్ సింగ్ దీనిని ఎలా నిలబెడతారన్నది చూడాలి. ఆయన సమర్థతకు పరీక్షే అంటున్నాయి మార్కెట్ వర్గాలు. ప్రస్తుతం మార్కెట్లో షేర్ రూ.50రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

Similar News