బీహార్ ప్రతిపక్షపార్టీ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అధికాపార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. బీహర్‌లో వరదల కారణంగా చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందికి లోనవుతున్నా.. అధికారపార్టీ నేతలకు అవేవి పట్టడంలేదని ట్విట్టర్ వేదికగా ద్వజమెత్తారు. ఈ కష్టకాలం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఏమీ లేవని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే 39 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. కానీ, వరదల కాలంలో ప్రజలకు అండగా ఉండేందుకు ఒక్క ఎంపీ కూడా వారి నియోజకవర్గాల్లో పర్యటంచలేదని అన్నారు. కనీషం ముఖ్యమంత్రి జాడలేకపోవడం విచారకరమని రాసుకొచ్చారు. సీఎం నితీష్ కుమార్ 125 రోజుల నుంచి కనిపించడం లేదని ద్వజమెత్తారు. నీటిపారుదల, ఆరోగ్య, విపత్తు నిర్వహణ మంత్రలెవరిదీ జాడ లేదు. ప్రభుత్వం నిద్రావస్తలో ఉంది. అందుకే మేమే వీలైనంత వరకు సహాయం చేస్తున్నామని తేజస్వీ ట్విట్టర్ లో మండిపడ్డారు.