రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దమవతున్నట్టు తెలుస్తుంది. స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసుల విషయంలో కేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చాలంటూ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వర్గం కోర్టును కోరిన విషయం తెలిసిందే. అయితే, కోర్టుకు కూడా అందుకు అంగీకారం తెలపడంతో తీర్పు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. దీంతో, సీఎం అశోక గెహ్లాట్ ఇరుకున పడేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. బలపరీక్షకు సిద్దమవుతున్నట్టు తెలుస్తుంది.
పార్టీ ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్‌లో సీఎం పరేడ్ నిర్వహించునున్నట్లు సమాచారం. ఇందుకోసం గవర్నర్ మిశ్రాను గెహ్లోత్ సమయం కూడా కోరారు. ఈ భేటీలోనే తాను బలపరీక్షకు సిద్ధమని, అందుకు తమను అసెంబ్లీని సమావేశపరచాలని సీఎం కోరతారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. సీఎం గెహ్లాట్ గురువారం రాత్రే గవర్నర్ కల్‌రాజ్ మిశ్రాను కలిసారు. తమకు పూర్తి మెజారిటీ ఉందని, వెంటనే అసెంబ్లీని సమావేశపరచడానికి అనుమతి కావాలని తెగేసి చెప్పారు.