దేశంలో 13 ల‌క్ష‌లు దాటిన క‌రోనా పాజిటివ్‌ కేసులు

Update: 2020-07-25 11:49 GMT

దేశంలో క‌రోనా కరాళ నృత్యం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా అంత‌కంత‌కు పెరుగుతూనే ఉంది. కేవలం మూడు రోజుల్లోనే ల‌క్ష‌కుపైగా కేసులు పెరిగాయి. దీంతో దేశంలో క‌రోనా కేసులు 13 లక్ష‌లు దాటాయి.

తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో దేశవ్యాప్తంగా 48,916 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయి. కరోనా బారిన పడి 757 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 13,36,861కు చేరింది. కరోనా మృతుల సంఖ్య 31,358కి పెరిగింది. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన పాజిటివ్‌ కేసుల్లో 4,56,071 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా బారిన పడి 8,49,431 మంది బాధితులు కోలుకున్నారు.

Similar News