ప‌శ్చిమ బెంగాల్‌లో సంపూర్ణ లాక్‌డౌన్‌!

Update: 2020-07-25 12:07 GMT

దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ప‌శ్చిమ బెంగాల్‌లో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప‌శ్చిమ బెంగాల్‌లో కరోనా కట్టడి చేయడానికి శనివారం సంపూర్ణ లాక్‌డౌన్ పాటిస్తున్నారు. క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో.. రాష్ట్రంలో వారానికి రెండు రోజుల పాటు లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నారు. దానిలో భాగంగానే శనివారం సంపూర్ణ లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్నారు. కోల్‌క‌తా విమానాశ్ర‌యం నుంచి శనివారం విమానాల‌ను ఆప‌రేట్ చేయ‌డం లేదు. రాష్ట్ర‌వ్యాప్తంగా రేష‌న్ దుకాణాల‌ను కూడా బంద్ చేశారు. గురువారం కూడా రాష్ట్ర‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌లు చేశారు.

Similar News