మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

Update: 2020-07-25 14:20 GMT

దేశంలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరిని కరోనా వదలడం లేదు. తాజాగా

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం కరోనా భారిన పడ్డారు. ఈ విషయాన్నీ స్వయంగా శివరాజ్ సింగ్ చౌహాన్ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. కొన్ని రోజులుగా తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని.. టెస్టు చేయించుకుంటే కోవిడ్ పాజిటివ్ అని తేలిందని అన్నారు. దీంతో తనను ఇటీవల కలిసిన ప్రతి ఒక్కరు కరోనా టెస్టు చేయించుకోవాలని సూచించారు.. కాగా మధ్యప్రదేశ్ లో మంత్రి అరవింద్ బడోరియాకు కూడా రెండు రోజుల కిందట కరోనా నిర్ధారణ అయింది.

Similar News