అన్ని రాష్ట్రల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. జూలై 27న సీఎంలతో ప్రధాని భేటీ కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వైద్య సదుపాయాలు, వైరస్ కట్టడికి వ్యూహాలు, అన్‌లాక్ 3.0 ప్రక్రియ తదితర అంశాలపై సీఎంలతో ప్రధాని చర్చించనున్నట్లు సమాచారం.