ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. గుజరాత్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అదేవిధంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌కు పశ్చిమాన, ఛత్తీస్‌గఢ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
జులై 26-28 మధ్య ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్‌లో అదేవిధంగా జులై 27-29 మధ్య పంజాబ్, హర్యానాలో భారీ వర్షాలు కురుస్తాయంది. జూలై 26-29 మధ్యకాలంలో ఉప-హిమాలియన్ పశ్చిమ బెంగాల్, అసోం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ లలో వర్షపాతం తీవ్రత పెరిగే అవకాశం ఉందంది.