ఢిల్లీలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. సీఆర్పీఎఫ్ 122వ బెటాలియన్‌లో ఓ ఎస్‌ఐ ఇన్‌స్పెక్టర్‌ను గన్‌తో కాల్చాడు. ఆ తర్వాత ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి లోధి ఎస్టేట్‌లోని హోంమంత్రి భవనం వద్ద జరిగింది. ఇన్‌స్పెక్టర్ దశరథ్ సింగ్, ఎస్‌ఐ కర్నేల్ సింగ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరిగి ఆగ్రహంతో ఇన్‌స్పెక్టర్‌పై ఎస్‌ఐ కాల్పులు జరిపాడు. దీంతో ఇన్‌స్పెక్టర్ దశరథ్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం తుపాకీతో కాల్చుకుని ఎస్‌ఐ కర్నేల్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.