బామ్మా భలే చేశావ్.. నీతో స్కూల్ పెట్టిస్తా: సోనూ సూద్

Update: 2020-07-25 14:43 GMT

వయసులో ఉన్న వాళ్లకే ఒళ్లు వంగదు ఒక్కోసారి పనిచేయాలంటే.. అలాంటి 85 ఏళ్ల బామ్మ ఎవరిమీదా ఆధారపడకూడదని తనకు వచ్చిన కర్రసాముని ప్రదర్శిస్తూ నాలుగు డబ్బులు సంపాదించుకుని జీవనం వెళ్లదీస్తోంది. పుణెకు చెందిన ఆజీమా యువకులకు ధీటుగా చేస్తున్న కర్రసాము సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ వయసులో కూడా ఆమె చేసిన కర్రసాముకి అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఈమె ఎవరు.. ఎంతబాగా చేస్తోంది అని ఆమెని గురించిన అన్వేషణ ప్రారంభమైంది. బామ్మ కర్రసాము వీడియో చూసిన సోనూ సూద్, దేశ్‌ముఖ్‌లు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. ఆమె వివరాలు తెలపాలని నెటిజన్లను కోరారు. ఆమెతో ఒక పాఠశాలను ప్రారంభిస్తా. దేశంలోని మహిళల ఆత్మరక్షణకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ఆమెని ఒప్పిస్తా అని ట్వీట్ చేశారు. రితేశ్ స్పందించి.. ధన్యవాదాలు ఎంతో స్ఫూర్తిదాయకమైన యోధురాలు ఆజీమా వివరాలు తెలిశాయి అని పేర్కొన్నారు.

Similar News