దేశవ్యాప్తంగా కరోనా కలకలం రేపుతోంది. అటు, మహారాష్ట్రం మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. దీంతో మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో లిక్కర్ హోండెలివరీకి అనుమతివ్వాలంటూ మహారాష్ట్ర వైన్ మర్చంట్స్ అసోసియేషన్ కోరింది. అయితే, లిక్కర్ నిత్యవసరం కాదని.. కనుక ఈ పిటిషన్‌ను వినడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ వినడానికి తమకు ఎలాంటి ఆసక్తీలేదని స్ఫష్టం చేసింది. ఇటీవల ఇదే విషయంపై మహారాష్ట్ర వైన్ మర్చంట్స్ అసోసియేషన్ బాంబే హేకోర్టు ముందు ఉంచగా.. దీనిపై స్పందించి హైకోర్టు.. ఈ వ్యవహారాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ముందుంచాలని పిటిషనర్‌కు చెప్పింది. అయితే, తాజాగా సుప్రీం కోర్టు కూడా హైకోర్టు వ్యాఖ్యలను సమర్థించింది.