కర్నాటక, కేరళలో పెద్ద ఎత్తున దాడులు జరపడానికి ఉగ్రవాదులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని ఐక్యరాజ్య సమతి హెచ్చరించింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు భారీ సంఖ్యలో ఈ రాష్ట్రాల్లో ఉన్నట్టు ఓ రిపోర్టు ద్వార తెలిపింది. సుమారు రెండు వందల మంది ఉగ్రవాదులు దాడులు చేయడానికి సిద్దంగా ఉన్నారని తెలిపింది. వీరంతా భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, మయన్మార్ కు చెందినవారేనని అన్నారు. అల్‌ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ కు ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ఒసామా మహమూద్ నాయకత్వంలో దాడులకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. తమ నాయకుడు అసీమ్ ఉమర్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికే దాడులకు ప్లాన్ చేస్తున్నారని ఐక్యరాజ్యసమతి రిపోర్టులో తెలిపింది.