వ్యాక్సిన్ వచ్చిన తరువాత నాపై విమర్శల దాడి జరుగుతుంది: ట్రంప్

Update: 2020-07-24 20:55 GMT

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ట్రంప్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కరోనా వ్యాక్సిన్ మార్కెట్ లోకి వచ్చిన తరువాత ప్రజల నుంచి తాను విమర్శల దాడి ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన అన్నారు. వ్యాక్సిన్ తానే ముందుగా తీసుకుంటే.. తనను స్వార్థపరుడు అని అంటారని.. అలా కాకుండా చివర్లో తీసుకుంటే వ్యాక్సిన్‌ సరిగా పని చేయదని.. అందుకే ఆఖర్న తీసుకున్నాడని అందరూ అనుకుంటారని అన్నారు. ఏం చేసినా తప్పు పట్టడం మాత్రం కామన్ అన్నారు.

Similar News