IRAN: "అమెరికాకు లొంగే ప్రసక్తి లేదు.."

గల్ఫ్ దేశాలకు ఇరాన్ క్షమాపణలు... పొరుగు దేశాలపై దాడులు నిలిపివేత.. అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్

Update: 2026-03-07 15:00 GMT

పశ్చి­మా­సి­యా­లో యు­ద్ధ మే­ఘా­లు కమ్ము­కు­న్న వేళ ఇరా­న్ అధ్య­క్షు­డు మసౌ­ద్ పె­జె­ష్కి­యా­న్ అత్యంత కీ­ల­క­మైన ప్ర­క­టన చే­శా­రు. ఇటీ­వల గల్ఫ్ దే­శా­ల­పై జరి­గిన దా­డు­ల­కు సం­బం­ధిం­చి ఆయన బహి­రం­గం­గా క్ష­మా­ప­ణ­లు చె­ప్పా­రు. ఇరా­న్ ప్ర­జ­ల­ను ఉద్దే­శిం­చి వి­డు­దల చే­సిన ఒక ప్ర­త్యేక వీ­డి­యో సం­దే­శం­లో ఆయన ఈ సం­చ­లన వ్యా­ఖ్య­లు చే­శా­రు. పొ­రు­గు దే­శా­లైన దు­బా­య్, కు­వై­ట్, బహ్రె­యి­న్, యూఏఈ వంటి దే­శా­ల­లో­ని చము­రు రి­ఫై­న­రీ­లు, వి­మా­నా­శ్ర­యా­ల­పై తమ మి­స్సై­ల్స్ దా­డు­లు చే­య­డం వె­నుక ఉన్న ఉద్దే­శా­న్ని ఆయన వి­వ­రిం­చా­రు. ఈ ప్రాం­తం­లో ఉద్రి­క్త­త­లు మరింత తీ­వ్ర­త­రం కా­కూ­డ­ద­నే ఉద్దే­శం­తో­నే తాము ఈ శాం­తి ని­ర్ణ­యా­న్ని తీ­సు­కు­న్న­ట్లు ఆయన వె­ల్ల­డిం­చా­రు.ఇజ్రా­యె­ల్, అమె­రి­కా దే­శాల దా­డు­ల­కు ప్ర­తీ­కా­రం­గా­నే ఇరా­న్ గతం­లో గల్ఫ్ దే­శా­ల­లో­ని యూ­ఎ­స్ఏ స్థా­వ­రా­ల­ను లక్ష్యం­గా చే­సు­కు­ని వి­రు­చు­క­ప­డిన సం­గ­తి తె­లి­సిం­దే. అయి­తే ఈ క్ర­మం­లో ఆయా దే­శా­ల­లో­ని పౌర వస­తు­ల­పై కూడా దా­డు­లు జర­గ­డం­తో గల్ఫ్ దే­శా­లు తీ­వ్ర ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­యి. ఈ నే­ప­థ్యం­లో­నే పె­జె­ష్కి­యా­న్ స్పం­ది­స్తూ, ఆ దే­శా­ల­పై దా­డు­లు చే­య­డం తమ అసలు ఉద్దే­శం కా­ద­ని స్ప­ష్టం చే­శా­రు. కే­వ­లం తమ ఆత్మ­ర­క్షణ కో­స­మే ఆ చర్య­లు తీ­సు­కో­వా­ల్సి వచ్చిం­ద­ని, జరి­గిన నష్టా­ని­కి చిం­తి­స్తు­న్నా­మ­ని ఆయన పే­ర్కొ­న్నా­రు. ఇకపై గల్ఫ్ దే­శా­ల­పై ఎలాం­టి దా­డు­లు జర­గ­బో­వ­ని ఇరా­న్ తా­త్కా­లిక నా­య­క­త్వ మం­డ­లి ని­ర్ణ­యిం­చి­న­ట్లు ఆయన అధి­కా­రి­కం­గా ప్ర­క­టిం­చా­రు. పొ­రు­గు దే­శా­ల­కు పె­జె­ష్కి­యా­న్ ఒక ము­ఖ్య­మైన హె­చ్చ­రి­క­తో కూ­డిన వి­న్న­పా­న్ని కూడా చే­శా­రు. తమ భూ­భా­గా­ల­ను అమె­రి­కా సై­నిక స్థా­వ­రా­లు­గా మా­ర్చ­వ­ద్ద­ని ఆయన సూ­చిం­చా­రు. గల్ఫ్ దే­శా­ల­లో­ని అమె­రి­కా స్థా­వ­రాల నుం­చి తమపై దా­డు­లు జర­గ­కుం­డా చూ­సు­కో­వా­ల్సిన బా­ధ్యత ఆయా దే­శా­ల­దే­న­ని ఆయన గు­ర్తు­చే­శా­రు. ఒక­వేళ పొ­రు­గు దే­శాల నుం­చి తమపై ప్ర­త్య­క్ష దా­డి­కి ది­గి­తే మా­త్రం, ధీ­టు­గా స్పం­దిం­చే హక్కు ఇరా­న్‌­కు ఉం­టుం­ద­ని ఆయన తే­ల్చి­చె­ప్పా­రు. "మీరు మా జో­లి­కి రా­కుం­టే.. మేము మీ జో­లి­కి రాము" అనే స్ప­ష్ట­మైన సం­దే­శా­న్ని ఆయన గల్ఫ్ దే­శా­ల­కు పం­పా­రు.

మరో­వై­పు అమె­రి­కా అధ్య­క్షు­డు డొ­నా­ల్డ్ ట్రం­ప్ డి­మాం­డ్ చే­సి­న­ట్లు­గా ఇరా­న్ బే­ష­ర­తు­గా లొం­గి­పో­వా­ల­న్న ప్ర­తి­పా­ద­న­ను పె­జె­ష్కి­యా­న్ పూ­ర్తి­గా తో­సి­పు­చ్చా­రు. అమె­రి­కా, ఇజ్రా­యె­ల్ దే­శా­ల­కు ఎట్టి పరి­స్థి­తు­ల్లో­నూ లొం­గే ప్ర­స­క్తి లే­ద­ని ఆయన మొం­డి­గా ప్ర­క­టిం­చా­రు. ఇరా­న్ ఆత్మ­గౌ­ర­వా­న్ని తా­క­ట్టు పె­ట్టే ప్ర­స­క్తే లే­ద­ని, బె­ది­రిం­పు­ల­కు భయ­ప­డే­ది లే­ద­ని ఆయన స్ప­ష్టం చే­శా­రు. ఇరా­న్‌­ను లొం­గ­దీ­సు­కో­వా­ల­న్న అమె­రి­కా కలలు ఎప్ప­టి­కీ సా­కా­రం కా­వ­ని, ఆ ఆశ­ల­ను వారు సమా­ధి చే­సు­కో­వా­ల్సిం­దే­న­ని ఆయన ఘా­టు­గా వ్యా­ఖ్యా­నిం­చా­రు.యు­ద్ధం కా­ర­ణం­గా పశ్చి­మా­సి­యా­లో సా­ధా­రణ ప్ర­జ­లు పడు­తు­న్న ఇబ్బం­దు­ల­ను తాము గమ­ని­స్తు­న్నా­మ­ని, శాం­తి స్థా­పన కో­స­మే తాము ఒక అడు­గు వె­న­క్కి వేసి క్ష­మా­ప­ణ­లు చె­బు­తు­న్నా­మ­ని ఇరా­న్ అధ్య­క్షు­డు వి­వ­రిం­చా­రు. అయి­తే ఇది తమ బల­హీ­నత కా­ద­ని, బా­ధ్య­తా­యు­త­మైన దే­శం­గా వ్య­వ­హ­రి­స్తు­న్నా­మ­ని ఆయన చె­ప్పు­కొ­చ్చా­రు. గల్ఫ్ దే­శా­ల­తో సం­బం­ధా­ల­ను తి­రి­గి మె­రు­గు­ప­రు­చు­కో­వ­డా­ని­కి సి­ద్ధం­గా ఉన్నా­మ­ని, కానీ అం­దు­కు అమె­రి­కా ప్ర­మే­యం లే­కుం­డా ఉం­డా­ల­ని ఆయన కో­రా­రు. యు­ద్ధ ఉద్రి­క్త­తల మధ్య ఇరా­న్ తీ­సు­కు­న్న ఈ ని­ర్ణ­యం అటు అరబ్ దే­శా­ల­లో, ఇటు పా­శ్చా­త్య దే­శా­ల­లో పె­ద్ద ఎత్తున చర్చ­కు దా­రి­తీ­సిం­ది.ఈ పరి­ణా­మం పశ్చి­మా­సి­యా రా­జ­కీయ చి­త్ర­ప­టా­న్ని మా­ర్చే అవ­కా­శ­ముం­ద­ని వి­శ్లే­ష­కు­లు భా­వి­స్తు­న్నా­రు. గల్ఫ్ దే­శాల ఆగ్ర­హా­న్ని చల్లా­ర్చ­డం ద్వా­రా అమె­రి­కా­ను ఒం­ట­రి­ని చే­యా­ల­నే­ది ఇరా­న్ ఎత్తు­గ­డ­గా కని­పి­స్తోం­ది. యు­ద్ధం కొ­న­సా­గు­తు­న్న తరు­ణం­లో పె­జె­ష్కి­యా­న్ చే­సిన ఈ ప్ర­క­టన అం­త­ర్జా­తీయ వే­ది­క­ల­పై ఇరా­న్ పట్ల ఉన్న వ్య­తి­రే­క­త­ను కొంత మేర తగ్గిం­చే అవ­కా­శం ఉంది. అమె­రి­కా ఆం­క్ష­లు, ట్రం­ప్ హె­చ్చ­రి­కల మధ్య ఇరా­న్ తన పం­థా­ను మా­ర్చు­కో­కుం­డా­నే శాం­తి మం­త్రా­న్ని జపిం­చ­డం ఇప్పు­డు చర్చ­నీ­యాం­శ­మైం­ది.

Tags:    

Similar News