ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీ లేవు. అత్యవసరమైతే తప్ప జాయిన్ చేసుకోవట్లేదు.. ఏ లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చిన వారిని హోంక్వారంటైన్ లోనే ఉండి వైద్యుల సూచన మేరకు మందులు వాడుతూ జాగ్రత్తలు పాటించమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరులోని ఓ వ్యక్తికి కోవిడ్ వచ్చి ఆస్పత్రిలో జాయినవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అతడితో పాటు మరో ఇద్దరికి పాజిటివ్ రాగా ముగ్గురినీ అంబులెన్స్ లో జీజీహెచ్ కు తరలించారు. అయితే అతడికి ఆస్పత్రిలో బెడ్ దొరకలేదు. అది గమనించిన అంబులెన్స్ డ్రైవర్.. నీతో పాటు వచ్చిన వాళ్లలో ఒక వృద్ధుడు బాగా దగ్గుతున్నాడు.. ఆయన బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. గంటలో పోతాడు.. అప్పుడు ఆ బెడ్ నీకే ఇస్తారు అని చెప్పాడు. అది విని యువకుడి కాలు నిలవలేదు. బెడ్లు ఖాళీ అయ్యే మార్గం కూడా కనిపించకపోవడంతో గంటల తరబడి ఆస్పత్రి బయట వేచివుండలేక ఇంటిదారి పట్టాడు.