విజయవాడ నగరంలో పదకొండు ప్రాంతాల్లో లాక్ డౌన్

Update: 2020-07-25 22:45 GMT

కృష్ణా జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జిల్లాతో పోలిస్తే విజయవాడలోనే కరోనా కేసులు అధికంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగరంలోని పదకొండు ప్రాంతాల్లో శనివారం నుంచి లాక్ డౌన్ విధిస్తున్నట్టు కలెక్టర్ ఇంతియాజ్ ప్రకటించారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే వ్యాపారాలకు అనుమతి ఇచ్చారు. నిత్యావసర దుకాణాలు,

మందుల షాపులకు ఆంక్షలనుంచి మినహాయింపు ఇచ్చారు. ఇదిలావుంటే కృష్ణా జిల్లాలో ఇప్పటివరకూ 5248 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇందులో 3921 మంది కోలుకున్నారు. 139 మంది మరణించారు. ఇక గత 24 గంటల్లో 407 పాజిటివ్ కేసులొచ్చాయి. ప్రస్తుతం జిల్లాలో యాక్టీవ్ కేసుల సంఖ్య 1188 గా ఉంది.

Similar News