దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. రోజు రోజుకీ పాజటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 48,661 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఒక్క రోజే 705 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 13,85,522కి చేరింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బారిన పడి ఇప్పటి వరకు 32,063 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్‌లలో 8,85,577 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక 4,67,882 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 32,223 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 63.54 శాతానికి పెరిగిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది.