తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,593 పాజిటివ్‌ కేసులు

Update: 2020-07-26 14:27 GMT

తెలంగాణలో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. నిత్యం పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో శనివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,593 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనా బారిన పడి ఒక్కరోజే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 54,059కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 463 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని 41,332 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో 12,264 మంది చికిత్స పొందుతున్నారు.

Similar News