శానిటైజర్లు ఎక్కువగా వాడినా ప్రమాదమే: ఆరోగ్య నిపుణులు

Update: 2020-07-25 19:28 GMT

హ్యాండ్ శానిటైజర్లు అతిగా వాడటం కూడా ప్రమాదమేనని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మనం సాదారణమైన పరిస్థితుల్లో లేమని.. వైరస్ స్వభావం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదని ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్.కె.వర్మ తెలిపారు. ఈ సమయంలో మనల్ని మనం రక్షించుకోవడానికి మాస్కులు తప్పనిసరిగా వాడాలని అన్నారు. వేడినీటినే తాగాలని.. చేతులు తరచూ కడుక్కోవాలని తెలిపారు. అవకాశం ఉన్నంత వరకూ సబ్బులతో చేతులు కడుక్కోవాలని అన్నారు. సబ్బు అందుబాటులో లేనపుడే శానిటైజర్లు వాడాలని అన్నారు. శానిటైజర్లు వినియోగిస్తే.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే బాక్టీరియా సైతం చనిపోతుందని ఆరోగ్య నిపుణులు ఇప్పటికే హెచ్చరికలు చేశారు.

Similar News