కరోనాపై పోరు ఇంకా ముగియలేదు: కేజ్రీవాల్

Update: 2020-07-25 19:06 GMT

దేశ రాజధానిలో ఢిల్లీలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఢిల్లీ ప్రజలు, ప్రభుత్వం ముందు కరోనా ఓడిపోయింది. ఒకప్పడు ప్రతీరోజు 5వేలకు పైగా కేసులు నమోదయ్యేవి. కానీ, ఇప్పుడు ప్రతీరోజు సుమారు వెయ్యి కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో కరోనా రోగులు కోలుకుంటూ ఇంటి బాటపడుతున్నారు. ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసులు లక్ష 30 వేలకు చేరువలో ఉన్నాయి. కాగా.. ఇందులో లక్ష 10వేల మందికి పైగా రికవరీ అవ్వగా.. 13681 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదవుతున్న కేసులు సంఖ్య గణనీయంగా తగ్గగా.. మరోవైపు రికవరీ రేటు పెద్ద ఎత్తున నమోదవుతుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆనందం వ్యక్తం చేశారు. బురారి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ కోవిడ్ సెంటర్ ను ప్రారంభిస్తూ.. కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలు గురించి వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కరోనాపై పోరాటం చేస్తున్నాయని.. దీంతో ఈ మహమ్మారిపై విజయం సాధించే దిశగా అడుగులు పడుతున్నాయని అన్నారు. ఇందులో భాగంగానే 450 పథకాలతో నూతన వార్డును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కరోనాపై విజయం సాధించామని.. అయితే ఆ మహమ్మారిపై పోరు ఇంకా ముగియలేదని అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా మళ్లీ విజృంభించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు

Similar News