సీపీఐ నేత రామకృష్ణ.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. కరోనా ప్రభావం ఎక్కువగా పోలీసులు, వైద్యసిబ్బంది తరువాత జర్నలిస్టులపై పడుతుందని లేఖలో వివరించారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. కరోనాపై చేస్తూ.. రాష్ట్రంలో ఇప్పటికే పలువురు జర్నలిస్టులు కరోనా బారినపడి మరణించారని.. మరికొందరు చికిత్స పొందుతున్నారని అన్నారు. జర్నలిస్టులకు కొత్త అక్రిడేషన్‌లకై ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి ఏడాదైందని.. వాటిని వెంటనే మంజూరు చేయాలని అన్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సొంత ఇల్లు కల.. కలగానే మిగిలిపోయిందని లేఖలో వివరించారు. ఆగస్టు 15నాటికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నసమయానికైనా జర్నలిస్టులకు ఇళ్లు కేటాయించాలని రామకృష్ణ లేఖలో కోరారు.