పెళ్లికుమార్తెకు కరోనా.. మధ్యలోనే ఆగిన పెళ్లి

Update: 2020-07-26 17:06 GMT

కర్నూల్ జిల్లాలో పెళ్లికూతురుకు కరోనా రావడంతో పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. ఈ ఘటన కర్నూల్ జిల్లా నందికొట్కూరులో జరిగింది. పట్టణానికి చెందిన యువతి, యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. 25 న ముహూర్తం, 26న తలంబ్రాలు పెట్టుకున్నారు. అయితే మరో 24 గంటల్లో పెళ్ళితంతు ఉందనగా పెళ్లికుమార్తెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రెండు కుటుంబాలు పెళ్లిని వాయిదా వేసుకున్నాయి. కాగా కర్నూల్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటివరకూ 10357 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇందులో 5674 మంది కోలుకున్నారు.. 156 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4527 గా ఉంది.

Similar News