ఆ రాష్ట్రంలో కరోనా తొలి మరణం..

Update: 2020-07-27 10:52 GMT

దేశంలో కరోనా సంక్రమణతో మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి 32 వేల 810 కు చేరుకుంది. 24 గంటల్లో 702 మంది రోగులు మరణించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 267 మంది మరణించారు. ఇప్పటివరకు ఇక్కడ 13,656 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే తమిళనాడులో 85 మంది మరణించారు. ఇక్కడ రాజధాని చెన్నైలో మరణాల సంఖ్య 2 వేలు దాటింది. చెన్నైలో ఇప్పటివరకు 2,008 మరణాలు సంభవించాయి. అలాగే కర్ణాటకలో 80 మంది మరణించారు. ఇప్పటివరకు ఇక్కడ 1,878 మంది రోగులు మరణించారు. ఆదివారం, ఆంధ్రప్రదేశ్‌లో 56 మంది సోకినవారు మరణించారు. దీంతో ఇక్కడ మృతుల సంఖ్య వెయ్యి దాటింది.

ఆదివారం 24 రాష్ట్రాల్లో 702 మంది రోగులు మరణించగా.. అందులో ఎక్కువగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలో అత్యధికంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ అత్యధికంగా 40, ఉత్తరప్రదేశ్ 39 , గుజరాత్ లో 21 , ఢిల్లీలో 21 , బీహార్లో 17, పంజాబ్లో 15, మధ్యప్రదేశ్లో 12, ​​ఒడిశా 11, రాజస్థాన్లలో 11. , జమ్మూ కాశ్మీర్‌లో 7, హర్యానాలో 3, ఛత్తీస్‌గర్ ‌లో 4, త్రిపురలో 2, పుదుచ్చేరి 2,

అలాగే గోవా, అస్సాం, కేరళలు కూడా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఇక సిక్కిం రాష్ట్రంలో కరోనా మొదటి మరణం నమోదైంది. హిమాచల్ ప్రదేశ్ 1 లో, లడఖ్ లో ఒకరు మరణించారు.

Similar News